నెల నెలా తెలుగు వెన్నెల - 01/27/2013 - ఆదివారం
ఈ సంవత్సరానికి మొదటి "వెన్నెల" కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. పున్నమి తరువాతి పాడ్యమి నాడు సభలో వెన్నెల
బాగా కాసింది.
సాయంత్రం
5:30 గం.
లకు మొదలు పెడదామనుకున్న కార్యక్రమం
కనీస-జనాభా ("quorum")
లేకపోవడం వల్ల దాదాపు ఒక
గంట ఆలస్యంగా ప్రారంభమయింది. అందువల్ల కార్యక్రమాన్ని కొంత కుదించ వలసి
వచ్చింది.
ఈ ఏడాది క్రమం తప్పకుండా
ప్రతి నెలా వెన్నెల కార్యక్రమాలు
జరుపుకోవాలని అందరూ తీర్మానించారు.
ప్రతి
నెలలోని మూడవ శుక్రవారం సాయంత్రం
7:30 గం.లకు కలుద్దామని నిర్ణయించారు.
ఎక్కడ జరిగేదీ కార్యవర్గం ఈ-మెయిలు ద్వారా
ప్రకటిస్తుంది.
మన హ్యూస్టన్ వెన్నెలకు బ్లాగు, వెబ్సైటులను పునరుద్ధరించాలనీ,
వాటిని ఎప్పటికప్పుడు
"update" చెయ్యాలనీ,
నిర్ణయించడమయింది. ఇప్పటికే తయారుగా వున్న బ్లాగూ, వెబ్సిటూ వాడవచ్చని అభిప్రాయం
వెలిబుచ్చారు.
క్రిందటి
నెల 25న పరమపదించిన కీ.శే. పెమ్మరాజు వేణుగోపాల
రావుగారి గురించి ఆయనతో దాదాపు ముప్ఫై
ఏళ్ళ పరిచయం ఉన్న వంగూరి చిట్టెన్ రాజు గారు, అనిల్
కుమార్ గారూ మాట్లాడారు. బహుముఖ
ప్రజ్ఞాశాలి అయిన పెమ్మరాజు గారి
నిండైన జీవితం గురించి క్లుప్తంగా వివరించి, తమ ఆంతరంగిక మితృల్లో
ఒకరుగా చిట్టెన్ రాజు గారు ఆయనను
పేర్కొన్నారు. అణు-భౌతిక శాస్త్రజ్ఞులు,
కవి, నాటక రచయిత, కథకులు,
చిత్రకారులు, శిల్పకారులు, ఇలా మరెన్నో రంగాలలో
నిష్ణాతులైన శ్రీ పెమ్మరాజుగారితో కొద్ది
పరిచయం వున్నవారు కూడా సభలో ఆయనకు
నివాళులర్పించారు. నేటి సభలో డా.
పెమ్మరాజు గారితో పరిచయం లేనివారు ఆ మహామనీషి గురించి
తెలుసుకో గలిగారు.
నెల రోజుల పైన ఆంధ్రదేశంలో
పర్యటించిన డా. చిట్టెన్ రాజు
గారు తమ అనుభవాలను పంచుకున్నారు.
డిసెంబరులో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల నుండి విజయనగరంలో గురజాడ
గారి ఇంటిని సందర్శించిన విశేషాలూ, తమకు దక్కిన "లోక్
నాయక్" పురస్కార సభ వివరాలూ, తమ
నూట పదహారు కథల సంకలనం ఆవిష్కరించడమూ,
దేశ రాజధాని ఢిల్లీలోని సాహిత్య అకాడెమీలో తమ అనుభవాలూ పంచుకున్నారు.
కార్యక్రమం
ఆలస్యంగా ఆరింభించడం వలన స్వీయ రచనలకు
వ్యవధి లేకపోయింది. వచ్చే నెల వెన్నెలకు
అందరూ అనుకున్న సమయానికి హాజరయితే తలపెట్టిన అంశాలన్నీ సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని మనవి.
No comments:
Post a Comment