హ్యూస్టన్ నగరం, శనివారం, ఫిబ్రవరి 15, 2014
ఈ నెల 15వ తారీఖున 44వ వెన్నెలని స్థానిక కేటీ లైబ్రరీలో విజయవంతంగా జరుపుకున్నాము. సాహితీ ఆత్మీయులు దూరాలను సైతం లెక్కజేయకుండా కార్యక్రమానికి విచ్చేసి బాష పట్ల, సాహిత్యం పట్ల తమకు గల సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. ఇంచుమించుగా ఈ సారి విచ్చేసిన మిత్రులంతా TCA వార్తాలేఖ చూసి రావడం గమనార్హం.
ఈ విడత ముఖ్యాంశం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం, అవసరమయిన
ఆలస్యం తర్వాత సత్యదేవ్ గారు “జరుగుతున్నది
జగన్నాటకం...” అనే
రచనావిశ్లేషణతో ప్రారంభించారు, సిరివెన్నెల
సొంత మాటలలో “బహుశా
ఈ రచన చెయ్యాడానికి గత 28 సంవత్సరాలుగా
ఈ రంగంలో ఉన్నానా అనిపించింది నాకు, ఇక
రచనలు చెయ్యవలసిన అవసరం ఉందా అనిపించేంత పరాకాష్టకి తీసుకెళ్ళిన రచన....” అని
చెప్పబడిన గొప్ప సృష్టిని సత్యదేవ్ గారు సరళంగా, ఆలోచింపజేసే
రీతిలో చదివి వినిపించారు, ‘వన్స్
మోర్’ అని
ప్రేక్షకులచే అనిపించుకోవడం దానికి తార్కాణం! దశావతారాలు
పురాణాలు మాత్రమే కాదు, కాలంతో
నిమిత్తంలేని స్ఫూర్తిదాతలని చెప్పే క్లిష్టమైన రచనని సత్యదేవ్ గారు సులువుగా పరిచయం చేసారు. దీనిలో
ముఖ్యంగా కృష్ణావతారపు వర్ణన సభికులని అమితంగా ఆకట్టుకుంది.
స్వర్ణకమలంలోని “శివపూజకు..”
అనే గీతంపై సత్యభామగారి వ్యాసాంశాన్ని వారు రాలేకపోవడంతో, మిత్రులు
రవి పొన్నపల్లి గారు ఉగ్గబట్టుకుని చదివి, ఇక
వీలుకాలేక రాగయుక్తంగా పాడి మరీ వినిపించారు.. అదే
సిరివెన్నెల పాటలకున్న గొప్పతనం!!
తెలుగులో అతి గొప్ప మూడు నవలలలో ఒకటిగా చెప్పుకోబడే బుచ్చిబాబుగారి నవల “చివరకు
మిగిలేది’, పుస్తక
సమీక్ష విభాగంలో ఈ నవలను శాయి రాచకొండగారు ఎంతో ఇష్టంగా సమీక్షించారు. నవలా
నేపధ్యం, అందులోని
పాత్రలు, వాటి
మధ్య ఘర్షణని టూకీగా పరిచయం చేసి. ..ఒక
గొప్ప రచనగా నిలిపిన కోణాలను సభికుల ముందు పరిచారు. చివరగా
“ఈ నవలని దొరికితే చదవడం కాదు, దొరికించుకుని చదవండి ఒక మహా రచయితకి అదే మనం ఇవ్వగలిగే నివాళి” అని ముగించడంతో అందరిలో చదవాలనే ఆసక్తిని రేకెత్తించారనడంలో అతిశయోక్తి లేదు. హుషారుగా సాగిన శాయి గారి బోనస్ అంశం సామెతలు, పాత
సామెతలతో పాటు సైబర్ సామెతలు, ఆంగ్ల
అనువాదాలు కలగలిపి అందరినీ నవ్వులతో ముంచెత్తారు.
సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి కుదర్చడం ఈ రోజుల్లో సోషియో-ఫాంటసీ అని చెప్పే మధు పెమ్మరాజు వ్యంగ్య గుళిక ‘పెళ్లి
ఓ వైకుంఠపాళి’ సభికులని
నవ్వించింది. మారుతీరెడ్డి
గారు ఇదే విషయాన్ని రాబోయే ఉగాది వేడుకల్లో లఘు నాటకంగా ప్రదర్శిస్తే బావుంటుందని సూచించడం జరిగింది.
చివరగా సమన్వయకర్త సత్యదేవ్ గారు వచ్చే నెల రోజుల్లో రాబోయే కార్యక్రమాల వివరాలను సభికులకు తెలియజేసి,
వారి ఆదరాభిమానాలను కృతజ్ఞతలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.
No comments:
Post a Comment