ప్రాచీన సాహిత్యంలో పదాలకు అర్థాలు చెప్పడంలో అరసున్నాల పాత్ర ఉంది. ఉదాహరణకి -
భాగవతం లోని ఉషాకన్య విరహం వర్ణించే పద్యం - "కలికి చేష్టలు భావగర్భంబు లైనను బ్రియుమీఁది కూరిమి బయలు పడఁగఁ..." అన్న పాదంలో "పడఁగ" అరసున్న ఉంటే బయలు పడగా..అనే అర్థం వస్తుంది. అదే అరసున్న లేకుండా పడగ అంటే పడగ (పాము పడగ లో పడగ) అర్థం వస్తుంది. అర్థం పొసగదు. .
మరో ఉదాహరణ. వీఁడు అనే పదం. అరసున్న ఉంటే ఇతడు అనీ లేకపోతే పట్టణము అని అర్థాలు.
అరసున్నాలు లేక పోతే మన ప్రాచీన సాహిత్యంలో అర్థాలు మారిపోతాయి . కాబట్టి అరసున్నల అవసరం ప్రచీన సాహిత్యంలో ఉంది
No comments:
Post a Comment